జర్నలిస్ట్ తులసి చందుపై ట్రోల్స్‌, బెదిరింపులు.. సామాజిక వివక్షపై గళం విప్పడమే ఆమె తప్పా?

హైదరాబాద్ నగరానికి చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందుకు ఇటీవలి కాలంలో ఆమెకు బెదిరింపులు ఎదురయ్యాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 Jun 2023 12:14 PM IST

Thulasi Chandu, Independent Journalist

జర్నలిస్ట్ తులసి చందుపై ట్రోల్స్‌, బెదిరింపులు.. సామాజిక వివక్షపై గళం విప్పడమే ఆమె తప్పా?

హైదరాబాద్: నగరానికి చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందుకు ఇటీవలి కాలంలో ఆమెకు బెదిరింపులు ఎదురయ్యాయి.. అంతేకాకుండా ట్రోల్‌లు కూడా ఎదురయ్యాయి. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లోని కంటెంట్ లో సామాజిక వివక్ష, పర్యావరణం, మతతత్వానికి సంబంధించిన సమస్యలపై విమర్శలు గుప్పించారు. ఆమె కంటెంట్ పై కొందరు ఆమెను వేధించడం, బెదిరించడం ప్రారంభించారు. తులసి తనకు ఎదురైన వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఎదుర్కొంటున్న అనుచిత ట్రోలింగ్, బెదిరింపులను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ఖండించింది. ప్రజా సమస్యలను పరిష్కరించడం జర్నలిస్టు పని అని ఫెడరేషన్ పేర్కొంది.

ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులదే కీలకపాత్ర. అభ్యంతరాలు ఉన్నవారు వేధింపులు లేదా ట్రోలింగ్‌లకు బదులు ప్రెస్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయాలి. అంతేకాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఏకపక్షంగా వ్యవహరించే వ్యక్తులను సమాజం సహించదు. తులసి చందు ఎదుర్కొంటున్న వేధింపులను ఖండించాలని మేము ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు పిలుపునిస్తున్నాము. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరి నుండి ఆమెకు మద్దతు ఉంటుందని తెలిపారు.

తెలుగు టెలివిజన్, ప్రింట్ మీడియాలో 14 సంవత్సరాలు పనిచేసిన తులసి చందు 2020 లో తెలుగు మీడియాలో విమర్శనాత్మక స్వరాలు లేకపోవడం కోసం స్వతంత్ర YouTube ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె వీడియోలపై హిందూ మితవాద సంస్థలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. ఆమెను 'హిందూ వ్యతిరేకి' అని చెప్పడమే కాకుండా బెదిరింపులకు గురిచేశారు.

తులసి మాట్లాడుతూ.. “జనవరి 2022 లో హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాను, నన్ను వేధించిన, బెదిరించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం. నేను ఇటీవల ఫేస్‌బుక్‌లో నా నిస్సహాయత, ఎదురవుతున్న సమస్యల గురించి పంచుకున్నాను, సోషల్ మీడియా వినియోగదారుల నుండి నాకు లభించిన సంఘీభావానికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను." అని అన్నారు.

మత రాజకీయాలు, అవినీతి, పరిపాలనా లోపాలపై తాను చేసిన విమర్శలు హిందూ మతంపై దాడి కాదని, తనను తప్పుగా అర్థం చేసుకున్నారని తులసి అన్నారు. “నేను పర్యావరణం, ప్రజల సమస్యలపై రెగ్యులర్ కంటెంట్ చేసినప్పటికీ, కొందరు విషపూరితమైన కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. పదే పదే నన్ను హిందూ వ్యతిరేకి అని పిలుస్తున్నారు. అటువంటి తప్పుడు వ్యాఖ్యలు, నిరాధారమైన ఆరోపణలు నన్ను చాలా నిరుత్సాహపరుస్తున్నాయి." అని అన్నారు. "తాను నిరంతర వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నానని.. స్వతంత్ర జర్నలిస్టుగా నా పనిని కొనసాగిస్తున్నా కూడా అడ్డుకుంటున్నారు. ఇవి నాలో భయం, అభద్రతా భావాన్ని సృష్టించాయి. నిరంతర వేధింపులు, బెదిరింపులు భవిష్యత్ తరాలపై, ముఖ్యంగా ఔత్సాహిక మహిళా జర్నలిస్టులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి" అని తులసి చెప్పుకొచ్చారు. ఇది నా గురించి మాత్రమే కాదు.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న జర్నలిస్టులందరి కోసం నేను మాట్లాడుతున్నానన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, స్వతంత్ర జర్నలిస్టుగా ఎవరూ నిలబడలేరని తెలిపారు. గౌరవప్రదమైన, నిర్మాణాత్మకమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం మొత్తం సమాజం నుండి సమిష్టి కృషి అవసరం.

ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన రిటైర్డ్ జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ, “నేటి ప్రపంచంలో, ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయినప్పటికీ, చాలా మంది నిర్మాణాత్మక చర్చలకు దిగరు.. చాలా కాలంగా పరిశోధనాత్మక జర్నలిజం చేస్తున్న వారి విషయంలో ఇది జరుగుతూ ఉంది. నిజాలను తెలుసుకోడానికి ప్రయత్నించకుండా జర్నలిస్టులపై దాడి చేయడమే పనిగా పెట్టుకుని ఉంటారు" అని అన్నారు. చాలా మంది ఆన్‌లైన్‌లో విమర్శలు, అసభ్యపదజాలంతో దూషించడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని షా నిరాశను వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన భవిష్యత్తులో సరైన సమాచారం కూడా మీ దగ్గరకు చేరలేదని తెలిపారు. పరిస్థితిని మెరుగవ్వాలంటే గౌరవప్రదమైన చర్చలను ప్రోత్సహించాలని అన్నారు.

Next Story