రాష్ట్రంలో న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ బదిలీ

Transfer of four IAS in Telangana. తెలంగాణ‌లో న‌లుగురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

By Medi Samrat  Published on  4 July 2023 3:05 PM IST
రాష్ట్రంలో న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ బదిలీ

తెలంగాణ‌లో న‌లుగురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు అధికారికంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి బ‌దిలీ ఉత్త‌ర్వులు విడుదల చేశారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా రొనాల్డ్ రోస్‌ను నియ‌మించింది. ఆయ‌న ప్ర‌స్తుతం ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ప్ర‌స్తుత జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ కు రాష్ట్ర అద‌న‌పు ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. మ‌రో అధికారి స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ను రాష్ట్ర సంయుక్త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌లో పేర్కోంది. ఆయ‌న ప్ర‌స్తుతం ప్రోహిబిష‌న్ అండ్‌ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా ఉన్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మ‌రో ముషార‌ఫ్ అలీ ఫారుఖీని స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ స్థానంలో ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులలో పేర్కొంది.





Next Story