విషాదం.. పిడుగుపాటుకు గొర్రెల కాపరితో పాటు 40 గొర్రెలు మృతి

తెలంగాణలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, పిడుగులు పడడంతో వర్షాలు విషాదకరంగా మారాయి.

By అంజి  Published on  17 March 2023 5:27 AM GMT
Nalgonda district, lightning

పిడుగుపాటుకు గొర్రెల కాపరితో పాటు 40 గొర్రెలు మృతి

తెలంగాణలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, పిడుగులు పడడంతో వర్షాలు విషాదకరంగా మారాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ మండలంలో పిడుగుపాటుకు ఓ గిరిజన గొర్రెల కాపరి, 40కి పైగా గొర్రెలు చనిపోయాయి. చింతల తండాకు చెందిన సైదానాయక్ అనే యువకుడు మేకల పెంపకంతో జీవనం సాగించేవాడు. మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్లి ఉదయం నుంచి మేత మేపిన తర్వాత చెట్టు కింద ఆపాడు. భారీ వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దీంతో పిడుగుపాటుకు యువకుడు, చెట్టుకింద ఉన్న సుమారు 40 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.

పిడుగుపాటుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది

విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిడుగుపాటు వల్ల సంభవించిన విపత్తుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో పిడుగు ధాటికి 26 మేకలు మృతి చెందాయి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఇంట్లోనే ఉండటం ముఖ్యం. ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు బయట ఉన్నప్పటికీ, లోహ వస్తువులు, నీటి వనరులు, విద్యుత్ ఉపకరణాలకు దూరంగా ఉండటం అవసరం.

తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయి

ఈరోజు తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇది నిన్నటి కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ, పిడుగులు పడే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో మెరుపు అనేది ఒక సాధారణ సంఘటన, కానీ అది ప్రమాదకరమైనదిగా మారవచ్చు.

Next Story