సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లిలో గల సురభి మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

By -  అంజి
Published on : 23 Feb 2026 6:27 AM IST

Siddipet News, Surabhi Medical College, Physiotherapy student suicide, Telangana Medical College, Mittapalli

సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లిలో గల సురభి మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీలో ఫిజియోథెరపీ చదువుతున్న ఓ విద్యార్థిని క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమె సురభి మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం (ఫ్రెషర్) చదువుతోంది. కాలేజీ ఆవరణలోని ఒక ఖాళీగా ఉన్న డార్మిటరీ గదిలోకి వెళ్లిన ఆమె, అక్కడ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Next Story