విషాదం.. ఊయలగా కట్టిన చీర మెడకు చుట్టుకుని బాలుడు మృతి
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 7:39 AM ISTవిషాదం.. ఊయలగా కట్టిన చీర మెడకు చుట్టుకుని బాలుడు మృతి
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాలో విషాదం చోటుచేసుకుంది. చీరతో కటిన ఊయలలో ఓ బాలుడు ఊగుతూ ఉత్సాహంగా ఉన్నాడు. ఇక అదే చీర ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుని ఊపిరాడక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దిందాకు చెందిన డగే నారాయణ, కాంతాయిబాయిలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు అంజన్న (12) ఉన్నారు. అంజన్ననున వారు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివస్తు్నారు.
మంగళవారం అంజన్న స్కూల్‌కి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉండి ఆడుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న తన అమ్మ చీరను ఊయలగా కట్టించుకుని సంతోషంగా గడుపుతున్నాడు. ఆడుకుంటూ ఉన్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకుంది. దాంతో బిగుసుకుపోయింది. ఇంట్లో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో చూడలేకపోయారు. కాసేపటికే ఇంట్లోకి సోదరి వచ్చి చూసింది. అప్పటికే తమ్ముడు చలనం లేకుండా పడిపోయి ఉండటాన్నిచూసింది. భయంతో కేకలు వేసింది. దాంతో.. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వచ్చి చూసి.. చీర నుంచి బాలుడిని విడిపించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ.. దురదృష్టవశాత్తు ఆస్పత్రికి వెళ్తుండగానే బాలుడు చనిపోయాడు. తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.