హైదరాబాద్‌లో ఇవాళ రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 10:30 AM ISTహైదరాబాద్‌లో ఇవాళ రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అధికారం కోసం ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారంలో ఆయా పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. అంతేకాదు.. ఎన్నికల హామీలతో ప్రజలను ఆకర్షించడం మొదలుపెట్టాయి. జాతీయ పార్టీల నేతలు కొందరు ఇక్కడకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌కు మరోసారి వస్తున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపుతో పాటు.. ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు వాహనదారులు ముందుగానే ఈ విషయాలు తెలుసుకుని ఇబ్బందుల పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పారు.
* ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రహదారులు మూసివేయబడతాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
* అలాగే సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లిస్తారని పేర్కొన్నారు.
* బేగంపేట నుంచి సంగీత్ కూడలి వైపు వచ్చే వాహనాలను సీటీవో ఎక్స్ రోడ్స్ వద్ద మళ్లిస్తారని చెప్పారు. వాటిని బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉప్‌కార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్ల వైపు పంపించనున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు చెప్పారు..
* బోయినపల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
* కార్ఖానా, ఏబీఎస్ నుంచి ఎస్‌బీహెచ్-ప్యాట్ని వైపు వచ్చే వాహనాలు స్వీకార్-ఉప్‌కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లాలి అంటూ పోలీసులు సూచనలు చేశారు. .
* ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్‌బీహెచ్- స్వీకార్-ఉప్‌కార్ వైపు అనుమతిలేదని పోలీసులు సూచించారు. క్లాక్ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తామని వెల్లడించారు. .
* జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్ రాజ్‌భవన్ వైపు పంపించనున్నట్లు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.