టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

TPCC president Revanth Reddy tests covid positive.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2022 4:06 AM GMT
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మ‌రో వైపు ఒమిక్రాన్ కూడా భ‌య‌పెడుతుతోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

క‌రోనా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంద‌రూ కూడా క‌రోనా బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వెల్ల‌డించారు.

Next Story
Share it