కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌.. వీడియో

TPCC chief Revanth reddy apologies to Komatireddy Venkat Reddy. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా.. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల

By అంజి  Published on  13 Aug 2022 5:27 AM GMT
కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌.. వీడియో

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా.. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల వ్యాఖ్యలకు బాధత్య వహిస్తూ రేవంత్‌ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్‌ చేశారు. చండూరు సభలో వ్యాఖ్యలపై, హోంగార్డు ప్రస్తావనపై సారీ చెబుతున్నట్లు రేవంత్‌ వీడియోలో పేర్కొన్నారు. చండూరు స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్ వ్యాఖ్య‌లు స‌రికాద‌ని రేవంత్ అన్నారు. చండూరు స‌భ‌లో త‌న‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన అద్దంకి దయాక‌ర్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రేవంత్‌ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ మ‌ధ్య ప‌త్రికా స‌మావేశంలో హోంగార్డ్ ప్ర‌స్తావ‌న‌, మునుగోడు బ‌హిరంగ స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్.. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని ఉద్దేశించి పరుషమైన ప‌ద‌జాలం వాడ‌టంతో వారు ఎంతో మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. పీసీసీ అధ్యక్షుడిగా క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి క్ష‌మాప‌ణ చెబుతున్నా. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవ‌రికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్య‌మంలో అత్యంత క్రియాశీల‌క పాత్ర పోషించి, రాష్ట్ర సాధ‌న‌లో పాత్ర పోషించిన కోమ‌టిరెడ్డిని అవ‌మానించే విధంగా ఎవ‌రూ మాట్లాడిన త‌గ‌దు. త‌దుప‌రి చ‌ర్య‌ల కోసం క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ చిన్నారెడ్డి సూచ‌న చేయ‌డం జ‌రుగుతంద‌ని రేవంత్ రెడ్డి త‌న వీడియోలో పేర్కొన్నారు.


Next Story
Share it