కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమించింది: టీపీసీసీ చీఫ్
నేషనల్ హెరాల్డ్ కేసులో నైతిక బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik
కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమించింది: టీపీసీసీ చీఫ్
నేషనల్ హెరాల్డ్ కేసులో నైతిక బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమించించి. కేటీఆర్‌కు అధికార దెయ్యం పట్టింది. కేసీఆర్‌కు పట్టిన దెయ్యం కేటీఆరే అని కవిత చెప్పకనే చెప్పారు. కవిత లేఖతో మతి భ్రమించిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం స్కామ్‌లో కేసీఆర్, హరీష్‌రావుకు నోటీసులు అందడంతో షాక్ తిన్న కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవినీతిపై కేటీఆర్ మాట్లాడుతుంటే.. అధికారం దెయ్యం పట్టిన కేటీఆర్ వేదాలు వల్లించినట్లు ఉంది..అని టీపీసీసీ చీఫ్ విమర్శించారు.
బీఆర్ఎస్ మూడు ముక్కలాటలో ఓ ముక్క కవిత ఓడిపోవడం ఖాయం..అని మహేశ్ కుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నట్లు బీఆర్ఎస్ నేతల మాటగా కవిత లేఖలో స్పష్టంగా చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు కేసీఆర్‌పై పొగడ్తలు, సానుభూతి తెలుపుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మైత్రికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుంది? పదేళ్ల పాలనలో మీ కుటుంబం చేసిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు నరేంద్ర మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంది ఎవరో ప్రజలకు తెలుసు. లిక్కర్ స్కాంలో కవితను బెయిల్ కోసం బీజేపీ కాళ్లు పట్టుకుంది ఎవరో కేటీఆర్‌కు తెలియదా..? రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కోమటి రెడ్డి ఒక సీనియర్ మంత్రి. కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతా బాగుండడంతో తట్టుకోలేని కేటీఆర్ అనవసర విషయాలను ప్రస్తావిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసు బీజేపీ కక్షపూరితంగా కాంగ్రెస్‌పై సృష్టించిన కేసు. కాంగ్రెస్ సొంత పత్రికకు ఆ పార్టీ వారు నిధులు ఇవ్వడం అవినీతి ఎట్లా అవుతుంది..? అసలు కాళేశ్వరం, మేడిగడ్డ, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా రేస్ ఇలా ఒకటేమిటి మీ అవినీతి జాబితాకు అంతే ఉండదు. మీరు చేసిన కాంట్రాక్టులు, దందాలు మరిచి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరం. ఒక వైపు కవిత, మరోవైపు కాళేశ్వరం కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేటీఆర్ ఎటూ పాలుపోక చివరికి మీడియాపై కూడా విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం..అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.