గ‌జ్వేల్‌లో కుప్ప‌కూలిన మూడంత‌స్తుల భ‌వ‌నం.. స‌రిగ్గా 10 నిమిషాల‌కు ముందే

Three Store building collapsed in gajwel.సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ ప‌ట్ట‌ణంలో అక‌స్మాత్తుగా మూడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2021 9:11 AM IST
Three Store building collapsed in gajwel

సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ ప‌ట్ట‌ణంలో అక‌స్మాత్తుగా మూడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఆ భ‌వ‌నం ప‌క్క‌న మ‌రో భ‌వ‌న నిర్మాణం చేప‌ట్టేందుకు పిల్లర్ గుంతలు తీస్తుండ‌గా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భ‌వ‌నం కూలిన స‌మ‌యంలో అందులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌లో జ‌గ‌దేవ్‌పూర్ మండ‌లం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. స్థానికులు వెంటే అతన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా.. ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి స‌రిగ్గా ప‌ది నిమిషాల ముందే అందులో ఉంటున్న 10 మంది బోరుబండి కార్మికులు ప‌నికి వెళ్లారు. లేక‌పోతే పెనే ప్ర‌మాదం జ‌రిగేద‌ని స్థానికులు అంటున్నారు. స‌మాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.




Next Story