గులాబ్‌ ఎఫెక్ట్‌.. 3 రోజుల పాటు అసెంబ్లీ వాయిదా

Three days holidays for Telangana assembly.తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను

By అంజి  Published on  28 Sept 2021 7:36 AM IST
గులాబ్‌ ఎఫెక్ట్‌.. 3 రోజుల పాటు అసెంబ్లీ వాయిదా

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. గులాబ్‌ తుఫాన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వరద పరిస్థితిని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను 3 రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తమ నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి.. వరద ప్రభావం, సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అక్టోబర్‌ 1వ తేదీన అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

మరోవైపు తుఫాన్‌ నేపథ్యంలో అధికారులను మంత్రి హరీష్ రావు అప్రమత్తం చేశారు. చెరువులు, ప్రాజెక్టుల నీటిమట్టాన్ని ఎప్పటికప్పూడ పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అలాగే తుఫాన్‌ కారణంగా ఇళ్లులను నష్టపోయిన వారికి తక్షణమే ఆర్థిక సాయంమందేలా చూడాలని మంత్రి హరీష్ రావు అన్నారు.

Next Story