త్వరలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం!
కొత్త రేషన్ కార్డుల అంశంపై రానున్న కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
By అంజి Published on 25 Jan 2024 3:27 AM GMTత్వరలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం!
తెలంగాణలో ఎంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల అంశంపై రానున్న కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కొత్త కార్డులకు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం, ఇది వరకే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చడం వంటి విషయాలపై చర్చించి, ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భారీగా విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా దీనిఐ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.8 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇంకా 20 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేయడం, సంఖ్య కూడా పెద్దదిగా ఉండటంతో పాత పద్ధతిలోనే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చేస్తేనే అసలైన అర్హులను గుర్తించవచ్చని భావిస్తోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ద్వారా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారికి వాటికి అందజేయాలని భావిస్తోంది.