నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బైపాస్ రహదారి నిర్మాణం కోసం జీవో జారీ చేసి చారకొండలో రెవెన్యూ అధికారులు నివాసాల కూల్చివేత చేపట్టారు. జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై 29 ఇళ్లు కూల్చివేస్తుండటంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు. గ్రామం మధ్యలో నుంచి బైపాస్ నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను అడ్డుకున్నారు. ఇళ్లను కూల్చవద్దని అడ్డుకున్న వారిని పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. అయితే వాహనంలోకి ఓ చిన్నారిని కూడా ఎక్కించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.