తెలంగాణలో అకాల వర్షాలు: హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే..
By - అంజి |
తెలంగాణలో అకాల వర్షాలు: హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు మూడు గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారి, వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే 2- 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ప్రస్తుతం 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. అకాల గాలుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవలం రాబోయే కొన్ని గంటలే కాకుండా, ఇవాళ (సోమవారం), రేపు (మంగళవారం) కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నేడు వర్ష సూచన ఉన్న జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు.
రేపటి వాతావరణ పరిస్థితి: రేపు ప్రధానంగా తూర్పు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో (భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూలు) అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరుతున్నారు.