తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి అయ్యింది. ఫలితాలను జూలై 7న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ సప్లిమెంటరీ పరీక్షలను దాదాపు 70వేల మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను www.bse.telangana.gov.in, results.bsetelangana.org అనే వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు.