Telangana: ఈ వారంలో విడుదలకానున్న ఇంటర్‌, టెన్త్‌ ఫలితాలు

తెలంగాణా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదలకానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

By అంజి  Published on  7 May 2023 7:15 AM GMT
Telangana students, Inter results , Tenth results, SSC

Telangana: ఈ వారంలో విడుదలకానున్న ఇంటర్‌, టెన్త్‌ ఫలితాలు

తెలంగాణా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదలకానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఎస్‌ఎస్‌సి బోర్డు ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేశాయి. ఎటువంటి తప్పులు జరగకుండా ఫలితాలను వెరిఫై చేస్తున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4, 2023 వరకు నిర్వహించబడ్డాయి. మొత్తం 5,05,625 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తయింది.

ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు, 2,49,747 మంది బాలురు, 2,44,873 మంది బాలికలు.. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 3 నుండి 13 వరకు పరీక్షలు జరిగాయి, జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ మార్కు షీట్లను సంబంధిత బోర్డుల అధికారిక వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు తప్పులు లేకుండా ఉండేలా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఎస్‌ఎస్‌సీ బోర్డు అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది.

పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన వారు త్వరలో నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.

Next Story