తెలంగాణలో పాఠశాలల వేళలను మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు విద్యాశాఖ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రాథమిక పాఠశాల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 గంటల నుంచి 9 గంటలకు మార్చింది ప్రభుత్వం. ఇక స్కూళ్ల క్లోజింగ్ టైమ్‌ను సాయంత్రం 4.45 గంటలకు బదులు సాయంత్రం 4.15 గంటలకు ముగియనుంది. ఇప్పుడు ఉదయం అరంగట సమయాన్ని ముందుకు జరిపి, సాయంత్రం కూడా ముందుకు జరిపింది.
అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పాఠశాలలు ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.