డిసెంబర్‌ 27 నుంచి 'రైతు బంధు' సాయం: సీఎం కేసీఆర్‌

Telangana Rythu bandhu scheme Release ... తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్‌. ఈనెల 27వ తేదీ నుంచి

By సుభాష్  Published on  8 Dec 2020 3:15 AM GMT
డిసెంబర్‌ 27 నుంచి రైతు బంధు సాయం: సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్‌. ఈనెల 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకూ రైతు బంధు‌ సాయం అందించనున్నట్లు తెలిపారు. నిన్న సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి రైతు బంధు అంశంపై చర్చించారు. ఆర్థిక సహకారంతో అందించే యాసంగి కోసం రైతుబంధు పథకం విడుదల చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సాయం ఆయా రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రూ.7.300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు కేసీఆర్‌ ఆదేవించారు.

రైతులందరికీ నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో నిధులు పడేలా చూడాలని సూచించారు. ప్రతి ఒక్క రైతుకు ఈ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మరో వైపు నేడు రైతులు, రైతు సంఆలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈ బంద్‌లో ప్రత్యక్ష్యంగా పాల్గొంటారని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయపోరాటం చేస్తున్నారని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ బంద్‌ విజయవంతానికి టీఆర్‌ఎస్‌ పార్టీ కృషి చేస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Next Story