సింగపూర్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ టీమ్.. తొలి రోజే కీలక ఒప్పందం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్‌కు విశేష స్పందన లభించింది. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ రైజింగ్ టీమ్ తొలి రోజే కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.
By Knakam Karthik Published on 17 Jan 2025 3:21 PM ISTసింగపూర్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ టీమ్.. తొలి రోజే కీలక ఒప్పందం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్‌కు విశేష స్పందన లభించింది. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ రైజింగ్ టీమ్ తొలి రోజే కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ సుబ్బారావు ఈ టీమ్‌లో ఉన్నారు.
#TelanganaRising ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఐటీ శాఖ మంత్రి @Min_SridharBabu గారు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (@ITESpore) సందర్శించారు.✅సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి… pic.twitter.com/4ReAEAilmf
— Telangana CMO (@TelanganaCMO) January 17, 2025
ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ టీమ్ సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తోన్న డెవలప్‌మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. అక్కడ ట్రెయినింగ్ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో సీఎం టీమ్ చర్చలు జరిపింది. హైదరాబాద్‌లోని ఫోర్త్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
నైపుణ్యాల అభివృద్ధి శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకునేలా, నైపుణ్యాల అభివృద్ధిలో భాగస్వామ్యానికి సంబంధించి MOUపై స్కిల్ వర్సిటీ వీసీ, ITE డిప్యూటీ డైరెక్టర్ సంతకాలు చేశారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ITE ప్రతినిధులు త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు CMO తెలిపింది.