తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం.. భారీగా పెరిగిన కేసులు

New corona cases in Telangana today.తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,08,602 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 8,126 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2021 4:24 AM GMT
TS corona update

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. గ‌డిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,08,602 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 8,126 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232 కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనా కార‌ణంగా 38 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రాష్ట్రంలో ప్రారంభ‌మైన నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,999కి పెరిగింది.

నిన్న 3,307 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,30,304కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 62,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.50 శాతంగా ఉండ‌గా, రిక‌వ‌రీ రేటు 83.57 శాతంగా ఉంది. కొత్త‌గా న‌మోదైన‌ పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1259 కేసులు ఉండ‌గా, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్‌లో 497, న‌ల్ల‌గొండ‌లో 346, ఖ‌మ్మ‌లో 339, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 334, సిద్దిపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో 306, క‌రీంన‌గ‌ర్లో 286, జ‌గిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున న‌మోద‌య్యాయి.


Next Story