తెలంగాణలో కరోనా ఉద్దృతి.. కొత్తగా ఎన్నికేసులంటే..?
Telangana reports 7754 new corona cases today.తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన
By తోట వంశీ కుమార్ Published on 1 May 2021 5:28 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,930 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 7,754 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. నిన్న ఒక్క రోజే 51 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,312కి పెరిగింది.
నిన్న 6,542 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,62,160కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 81.68 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.52శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,507 ఉన్నాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 630, రంగారెడ్డిలో 554, సంగారెడ్డిలో 325, కరీంనగర్‌లో 281, మహబూబ్‌నగర్‌లో 279, సిద్దిపేటలో 279, నిజామాబాద్‌లో 267, జగిత్యాలలో 255, సూర్యాపేటలో 242, వికారాబాద్‌లో 242, నల్లగొండలో 231, ఖమ్మంలో 230, మంచిర్యాలలో 216, వరంగల్ రూరల్‌లో 208 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.