తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,03,770 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 7,432 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా శనివారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో వెల్లడింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3.87లక్షలను దాటాయి. రాష్ట్రంలో నిన్న 33 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఒక్క రోజులో 2,152 మంది కోలుకున్నారు.
కరోనా వ్యాప్తి మొదలైనప్పటికి నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారిసంఖ్య 3.26లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక జీహెచ్‌ఎంసీలోనే అత్యధికంగా 1,464 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌లో 606, రంగారెడ్డి 504, నిజామాబాద్ 486, ఖమ్మం 325 వరంగల్ అర్బన్ 323, మహబూబ్‌నగర్ 280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.