తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

Telangana corona cases today.తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 1,30,105 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,542 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2021 4:12 AM GMT
TS corona update

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. బుధ‌వారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 1,30,105 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,542 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901 కి చేరింది. నిన్న ఒక్క రోజే 20 మంది మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,876కి చేరింది.

నిన్న 2,887 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,19,537 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా న‌మోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 898, మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్‌ అర్బన్‌ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు.


Next Story
Share it