తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,335 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 5,567 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.73 లక్షలకు చేరింది. నిన్న ఒక్క రోజే 23 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,899కి చేరింది.
నిన్న 2,251 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.21లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 989, మేడ్చల్‌లో 421, రంగారెడ్డిలో 437, నిజామాబాద్‌లో 367, మహబూబ్‌నగర్‌లో 258 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.