తెలంగాణ‌లో క‌రోనా విల‌యం.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

Telangana reports 5093 new corona cases today.తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 1,29,637 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 5,093 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2021 4:20 AM GMT
telangana corona cases

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 1,29,637 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 5,093 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తాజాగా విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఒక్క రోజు వ్య‌వ‌ధిలో న‌మోదైన అత్య‌ధిక కేసులు ఇవే.

దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. కొత్త‌గా న‌మోదు అయిన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 743 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 15 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా మృతి చెందిన వారి సంఖ్య 1,824కి చేరింది. ఇక నిన్న 1,555 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,12,563 చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 24,156 మంది హోం ఐసోలేష‌న్‌లో చికిత్స తీసుకుంటున్నారు.


Next Story