తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,21,800 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 3,840 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885కి చేరింది.
కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 9 మంది ప్రాణాలు కోల్పోగా .. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన్పపటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,797కి చేరింది. నిన్న కరోనా బారి నుంచి 1198 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 20,125 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.