తెలంగాణ‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. తొలిసారి 10వేల‌కు పైగా కేసులు

New corona cases in Telangana today.తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 99,638 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 10,122 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 4:21 AM GMT
TS corona update

తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ ఉగ్ర‌రూపం దాల్చింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 99,638 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 10,122 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఒక రోజు వ్య‌వ‌ధిలో నమోదు అయిన అత్య‌ధిక కేసులు ఇవే. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,11,905 కు చేరింది. నిన్న 52 మంది మృత్యువాత ప‌డ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2094కి పెరిగింది.

నిన్న ఒక్క రోజే 446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,40,590కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 69,221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1440 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 751, రంగారెడ్డిలో 621, వరంగల్‌ అర్బన్‌లో 653, నిజామాబాద్‌లో 498, నల్లగొండలో 469, ఖమ్మంలో 424, మహబూబ్‌నగర్‌లో 417, కరీంనగర్‌ జిల్లాలో 369 చొప్పున నమోదయ్యాయి.


Next Story