తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయ్..ఎంపికైన వారి జాబితా ఇదే

తెలంగాణ గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.

By -  Knakam Karthik
Published on : 28 Sept 2025 4:57 PM IST

Telangana, TGPSC, Group-2 Results

తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయ్..ఎంపికైన వారి జాబితా ఇదే

తెలంగాణ గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్​-2 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 783 పోస్టులకు ఈ పరీక్ష జరిగింది. వీటికి ఎంపికైన 782 మంది జాబితాను ఆదివారం ప్రకటించింది టీజీపీఎస్సీ. ఒక్క పోస్టు ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది.

Next Story