Telangana: ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం పేదలకు ఫ్రీ సీట్లు
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 4:30 AM GMTTelangana: ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం పేదలకు ఫ్రీ సీట్లు
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో 25 శాతం పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలనే నిబంధనను అమలు చేయడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఈ నిబంధనలు కర్ణాకటకలో ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తోంది.
ఈ విద్యా హక్కు ప్రకారం సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లు లేని చోట్లలో ప్రయివేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను ఉచితం పేద విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు దీనిపై హైకోర్టులో నడుస్తోంది. ఇదే అంశంపై గత నెలలో అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీదేవసేన. విద్యాశాఖ ముఖ్యకార్యదర్వి బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1) సీ ప్రకారం ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో 25శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇది అమలు చేస్తే సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సర్కారు బడుల్లో లక్షలాది ట్రెయిన్‌డ్ టీచర్లు ఉండగా, త్వరలో మరో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఈ చట్టం అమలు సర్కార్ బడుల పట్ల శాపం అవుతుందని పలువురు చెబుతున్నారు. మరోవైపు విద్యారంగానికి ప్రతి ఏటా నిధుల కేటాయింపును ప్రభుత్వం పెంచుతోందనీ అధికారులు చెబుతున్నారు.
కాగా.. కర్ణాటకలో ఒక కిలోమీటర్ లోపు ప్రైమరీ, మూడు కిలోమీటర్లలోపు అప్పర్ ప్రైమరీ సర్కారీ స్కూల్ లేకపోతేనే ప్రైవేటు స్కూళ్లలో 25శాతం ఉచిత సీట్ల విధానం కర్నాటకలో అమలు చేస్తున్నారు. మరి తెలంగాణలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.