Telangana Polls: రాష్ట్రంలో అధికారుల వరుస బదిలీలు.. మరిన్ని జరిగే ఛాన్స్‌

తెలంగాణలోని పలువురు టాప్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులపై బదిలీల కత్తి వేలాడుతూ ఉంది. రానున్న రోజుల్లో మరో సారి బదిలీలు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2023 1:02 PM IST
Telangana Polls, transfer, officers, Election Commission of India

Telangana Polls: రాష్ట్రంలో అధికారుల వరుస బదిలీలు.. మరిన్ని జరిగే ఛాన్స్‌ 

తెలంగాణలోని పలువురు టాప్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులపై బదిలీల కత్తి వేలాడుతూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్.సుబ్బా రాయుడు, కలెక్టర్ బి.గోపిల బదిలీలు జరిగాయి. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత భారత ఎన్నికల సంఘం బదిలీలను చేయడం ఇది మూడవ రౌండ్ అని అంటున్నారు. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వులపై తెలంగాణలో పనిచేస్తున్న ఇతర రాష్ట్ర కేడర్‌ అధికారులపై రానున్న రోజుల్లో మరో సారి బదిలీలు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తెలంగాణలోని అధికార వర్గాలు పెదవి విప్పినప్పటికీ, బదిలీలు భారతీయ జనతా పార్టీ కారణంగానే జరుగుతున్నాయని అభివర్ణించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ బండి సంజయ్‌ చేసిన ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకుంటోందని తొలి రౌండ్‌లోనే బదిలీ అయిన సీనియర్‌ అధికారి ఒకరు ఆరోపించారు.

"కొంత కాలం క్రితం, కరీంనగర్ లో వివిధ వర్గాలకు చెందిన ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ సంఘటనను మతపరమైన మలుపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బీజేపీ రంగంలోకి దిగింది. కొన్ని వందల మందిని అడ్డుకున్నారు. కస్టడీలో ఉంచిన తరువాత విడుదల చేశారు. వారిలో ఎక్కువ మంది బీజేపీ క్యాడర్‌కు చెందినవారు. సంఘటన జరిగిన సమయంలో కరీంనగర్ పోలీసులు తమ బాధ్యతలను ప్రయత్నించారు. అయితే ఈ ఘటన పై ఈసీఐకి బీజేపీ ఫిర్యాదు చేయడంతో పోలీసు కమీషనర్ బదిలీ జరిగింది. దీని వెనుక తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఉండొచ్చు" అని ఒక అధికారి న్యూస్ మీటర్ కు చెప్పారు.

అదే విధంగా.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ అధికారి ఆన్ స్పెషల్ డ్యూటీ, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ రాధా కిషన్‌ను కూడా విచారించారు. “కాంగ్రెస్ ఫిర్యాదుతో డిసిపి రాధా కిషన్‌ను రెండవ రౌండ్‌లో భాగంగా బదిలీ చేశారు. బీజేపీకి లొంగని అధికారులను టార్గెట్ చేస్తున్నారు. మొదట సంబంధిత అధికారులపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విచారణకు ఆదేశిస్తారు. దాని ఆధారంగా బదిలీ జరుగుతుంది. అయితే మీరు చివరి మూడు రౌండ్లు చూస్తే, డీజీపీ నుండి ఎటువంటి నివేదిక కోరలేదు. బీజేపీ లేదా కాంగ్రెస్ నుండి ఏదైనా ఫిర్యాదు సీరియస్‌గా తీసుకున్నారు. బదిలీ ఉత్తర్వులు వస్తున్నాయి" అని అధికారి తెలిపారు.

పలు బదిలీలు:

మొదటి రౌండ్:

తెలంగాణలో 13 మంది ఉన్నతాధికారులు, నలుగురు కలెక్టర్లు, ఒక ఐఏఎస్, ఇద్దరు అధికారులను అక్టోబర్ 11న ఈసీ బదిలీ చేసింది. వీరిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్, నిజామాబాద్ పోలీస్ చీఫ్ వీ సత్యనారాయణ ఉన్నారు.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాబితాలో సంగారెడ్డి- ఎం రమణ, కామారెడ్డి - బి శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల్ - ఎ భాస్కర్, మహబూబ్ నగర్- కె నరసింహ, నాగర్ కర్నూల్- కె మనోహర్, జోగులాంబ గద్వాల్- కె సృజన, మహబూబాబాద్- జి చంద్రమోహన్, నారాయణపేట- ఎన్ వెంకటేశ్వరులు, జయశంకర్ భూపాలపల్లి- పి కరుణాకర్, సూర్యాపేట- రాజేందర్ ప్రసాద్‌లు ఉన్నారు.

బదిలీ అయిన నలుగురు కలెక్టర్లలో రంగారెడ్డి నుండి ఎస్ హరీష్ ఉన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి నుంచి డి అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి నుంచి వినయ్ కృష్ణా రెడ్డి, నిర్మల్ నుండి విష్ణు రెడ్డి, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌ ఎండీ ముషారఫ్‌ అలీ ఫరూఖీ ఇటీవలే బదిలీ అయ్యారు.

అధికారిక ప్రకటనలో "రాష్ట్ర ఎన్నికలు 2023 పూర్తయ్యే వరకు వారిని ఎటువంటి ఎన్నికల పనులకు కేటాయించకూడదు" అని ఉంది. తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి, కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఐఏఎస్‌ టీ శ్రీదేవిని కూడా తొలగించాలని కమిషన్‌ ఆదేశించింది.

రెండో రౌండ్:

అక్టోబర్ 20న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్‌డీ పి రాధా కిషన్ బదిలీ చేయబడ్డారు. కానీ ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ కేటాయించలేదు. అదే రోజు ఐదుగురు డీసీపీలు బిరుదరాజు రోహిత్ రాజు, బీ. బాలస్వామి, డీసీపీ, ఎస్‌బీ, రాచకొండ; నితికా పంత్, ఐపీసీ (RR:2017), డీసీపీ, ఉమెన్ సేఫ్టీ, సైబరాబాద్; డాక్టర్. చేతన మైలబత్తుల, ఐపీఎస్‌ (RR:2013), జాయింట్ డైరెక్టర్, యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్; డాక్టర్‌. తరుణ్ జోషి, ఐపీఎస్‌ (RR:2004), ఐజీపీ, లను బదిలీ చేశారు. ఐదుగురికీ పోస్టింగ్‌లు ఇచ్చారు.

మూడో రౌండ్:

కరీంనగర్ పోలీస్ కమీషనర్ IPS L సుబ్బా రాయుడు, కలెక్టర్ B. గోపి మూడవ రౌండ్ బదిలీలలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Next Story