మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు

మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

By అంజి  Published on  16 Nov 2023 8:58 AM IST
Telangana Polls, IT searches, Miryalaguda, BRS candidate,Nallamothu Bhaskar Rao

మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 40 బృందాలతో ఐటీ సోదాలు జరుపుతోంది. ఉదయం 4 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఎన్నికల కోసం భారీగా డబ్బు కూడబెట్టినట్టు సమాచారం రావడంతోనే ఈ ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మిర్యాలగూడలోని వైదేహి వెంచర్స్ లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు శ్రీధర్ తో పాటు వాళ్ళ కుమారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వైదేహి కన్స్ట్రక్షన్ పేరుతో నల్లమోతు భాస్కరరావు అనుచరులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాస్కరరావుకు పలు మార్గాల ద్వారా నిధులు సమకూరినట్లు ఐటీ అధికారులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారని తెలుస్తోంది.

Next Story