Telangana Polls: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
By అంజి Published on 30 Nov 2023 8:02 AM ISTTelangana Polls: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలువురు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్‌కు చేరుకున్న ఆయన.. క్యూలో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నటుడు ఎన్టీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేశారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బాలాజీసింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో సినీ దర్శకుడు తేజ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లా తన స్వంత గ్రామంలో అంతర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బంజారాహిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు అంతా ఓటు వేసేందుకు ముందుకు రావాలని, పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేస్తుందని కవిత అన్నారు. మాదాపూర్ లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ స్టేషన్ లో తన సతీమణి తో కలిసి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్‌లో మంత్రి మల్లారెడ్డి ఆయన సతీమణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.