Telangana: ఎన్నికలో బరిలో బర్రెలక్క.. కొల్లాపూర్ నుంచి పోటీ
నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పేర్కొన్నారు.
By అంజి Published on 9 Nov 2023 8:37 AM ISTTelangana: ఎన్నికలో బరిలో బర్రెలక్క.. కొల్లాపూర్ నుంచి పోటీ
బర్రెలక్క అలియాస్ శిరీష్.. రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరూ బర్రెలక్క పేరు వినే ఉంటారు. డిగ్రీ చదివి తాను బర్రెలు కాసుకుంటున్నానని ఆమె చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ''హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను డిగ్రీ చేసాను. ఫ్రెండ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా అమ్మను కొన్ని డబ్బులు అడిగి బర్రెలు కొన్నాను ఫ్రెండ్స్. ఎన్ని డిగ్రీలు చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్తలేవు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్'' అంటూ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపారు. ఆ వీడియోలోని బర్రెలక్క మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
ఆమె ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసింది. నిరుద్యోగుల తరపున పోరాడటం కోసమే తాను పోటీ చేస్తున్నానని శిరీష తెలిపింది. ప్రజలకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదన్న శిరీష.. ప్రచారం చేయడానికి అంత సమయం కూడా లేదని తెలిపింది. ఈ ఎన్నికల సమయంలో అందరిని కలవకపోవచ్చు అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష బుధవారం కొల్లాపూర్‌లో రిటర్నింగ్ అధికారి కుమార్‌దీపక్‌కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి యూట్యూబ్, సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వారి తీరుపై నిరసనగా నిరుద్యోగుల గొంతు వినిపించడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
నామినేషన్ వేసిన బర్రెలక్కరీల్స్ ద్వారా ఫేమస్ అయిన బర్రెలక్క ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేసింది. pic.twitter.com/LuphFWHGcS
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2023