మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల బ్యాడ్‌న్యూస్

ముందుబాబులకు హైదరాబాద్‌ పోలీసులు బ్యాడ్ న్యూస్‌ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  23 March 2024 1:45 PM IST
telangana, police, holi,  wine shop,

మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల బ్యాడ్‌న్యూస్ 

ముందుబాబులకు హైదరాబాద్‌ పోలీసులు బ్యాడ్ న్యూస్‌ చెప్పారు. హోలీ సందర్భంగా హైదరాబాద్‌ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైన్‌షాపులు, పబ్‌ల నిర్వాహకులకు పోలీసులు ఆదేశాలను జారీ చేసింది. దాంతో.. హోలీ ఒక్కరోజున హైదరాబాద్‌ వ్యాప్తంగా మద్యం లభించదు అన్నమాట. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అన్ని వైన్‌ షాపులు, బార్లు, పబ్‌లో క్లోజ్‌ చేయాలని పోలీస్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. వైన్‌షాపులే కాదు కల్లు దుకాణాలను కూడా మూసివేయనున్నారు.

అయితే.. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్‌ క్లబ్‌లకు హోలీకి క్లోజ్‌ చేయడం నుంచి పోలీసులు మినహాయింపు ఇచ్చారు. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మూడు పోలీస్‌ కమిషనరేట్ల కమిషనర్లు హెచ్చరించారు. హోలీ సందర్భంగా ఆకతాయిలు రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తారనీ.. ఇక మద్యం దుకణాలు తెరిచి ఉంటే ఇంకెక్కువ గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ముందు జాగ్రత్తగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు, వివాదాలకు తెరలేపకుండా ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

అలాగే.. హోలీ సందర్భంగా దుకాణాల మూసివేతతో పాటు ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పోలీసులు. ఇతరులపై రంగులను బలవంతంగా పూయొద్దని.. రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు. ఇక మరోవైపు రోడ్లపై ఎవరైన బైక్‌లపై హంగామా చేస్తే న్యూసెన్స్ కింద చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story