TSCOP సహా తెలంగాణ పోలీసుల వెబ్‌సైట్‌లు, యాప్‌ల నుండి భారీ డేటాను హ్యాక్ చేశారు. వీటిని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఈ లీక్‌ను గుర్తించారు డేటా సెక్యూరిటీ రీసెర్చర్ శ్రీనివాస్ కొడాలి. కీలకమైన డేటా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ పోలీసుల సిటిజన్ సర్వీస్ హాక్ ఐ అప్లికేషన్‌లోని డేటా ఆన్‌లైన్‌లో కూడా లీక్ అయినట్లు నివేదించబడిన కొద్ది రోజులకే కొత్త డేటా ఉల్లంఘన జరిగింది.
HawkEye ఉల్లంఘనకు కారణమైన హ్యాకర్ TSCOP భద్రతా ఉల్లంఘన వెనుక ఉన్నట్లు నమ్ముతున్నారు. తెలంగాణ పోలీసు SMS సర్వీస్ పోర్టల్, HawkEye డేటా లీక్ అయిన తర్వాత.. ఇదే వారంలో ఇది మూడవ డేటా లీక్. దొంగిలించిన డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయించే ప్లాట్‌ఫారమ్ BreachForumsలో డేటా ప్రివ్యూను షేర్ చేశారు. పోలీసు అధికారుల పేర్లు, ర్యాంక్‌లు, చిత్రాలతో సహా క్రిమినల్ రికార్డ్‌ల సున్నితమైన వివరాలు, వివిధ చట్టాల అమలు వివరాలు ప్లాట్‌ఫారమ్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.