కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గమనిక.. పరీక్ష తేదీ మారింది

Telangana Police constable exam postponed to August 28. ఈ నెల 21న నిర్వహించాల్సిన తెలంగాణ పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష వారం రోజుల పాటు వాయిదా పడింది.

By అంజి  Published on  8 Aug 2022 12:50 PM GMT
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గమనిక.. పరీక్ష తేదీ మారింది

ఈ నెల 21న నిర్వహించాల్సిన తెలంగాణ పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈ నెల 28న పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. టెక్నికల్‌ కార‌ణాల‌తోనే పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్‌ను వారం రోజుల పాటు రీషెడ్యూల్ చేస్తున్న‌ట్లు తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వ‌హించిన విషయం తెలిసిందే.

ప్రెస్‌ నోట్‌ కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.


Next Story
Share it