కొత్త రేషన్‌కార్డుల కోసం పెరుగుతున్న దరఖాస్తులు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.

By -  Srikanth Gundamalla
Published on : 7 Dec 2023 10:02 AM IST

telangana, new ration card, heay applications ,

కొత్త రేషన్‌కార్డుల కోసం పెరుగుతున్న దరఖాస్తులు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవాళే ఏర్పాటు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు అనేక హామీలు అమలు చేయబోతుంది. వీటి అమలులో లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డులు కీలకం కానున్నాయి. దాంతో.. ఇప్పటికీ రేషన్‌కార్డుల జాబితాల్లో లేనివారు కొత్త కార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. కాగా.. 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిపోయింది. అలాగే అర్హులైన కుటుంబాల సంఖ్య కూడా ఓ వైపు పెరిగిపోవడంతో దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడనుండటంతో.. రేషన్‌కార్డుల ఆధారంగానే ఆరు గ్యారెంటీలు అమలు అవ్వనున్నాయని తెలుస్తోంది. దాంతో.. తమకు ఇప్పుడు కొత్త రేషన్‌కార్డులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

సన్నబియ్యం పంపిణీతో పాటు మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాలు లభిస్తాయనే చాలా రకు మీసేవా కేంద్రాల్లో లబ్ధిదారులు కొత్తకార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. చాలా చోట్ల రేషన్‌కార్డులు పెండింగ్‌లో ఉండిపోయాయి. హైదరాబాద్‌ జిల్లాలో 6.36 లక్షలు, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 7.8 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. పాతకార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చడానికి వీలుగా హైదరాబాద్‌ జిల్లాలో 1.28 లక్షల దరఖాస్తులు అందాయి. తిరస్కరించిని, ఇక పరిశీలించినవి పోను 74,802 పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. రంగారెడ్డిరెలో 50వేల, మేడ్చల్‌ జిల్లాలో 40వేల వరకు రేషన్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.

మూడు జిల్లాల్లోనే 2.8 లక్షల కార్డులను వేర్వేరు కారణాలతో అనర్హులుగా గుర్తించి తొలగించారు అధికారులు. వీరంతా సుప్రీంకోర్టును కూడా వ్రయించారు. దీనిపై రీసర్వేకు కూడా గత జులైలో ఆదేశించింది. ఇంటింటి సర్వే చేసిన అధికారులు ఇప్పటి వరకు లబ్ధిదారులు వివరాలను వెల్లడించలేదు. ఇక ఇలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోని వారంతా కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Next Story