తెలంగాణ‌లో మినీ మున్సిపోల్స్‌ ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలతోపాటు గజ్వేల్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్‌ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు గత నెల 30న ఎన్నికలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప‌క్రియ‌ జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆయా కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండే కౌంటింగ్ మొద‌లైంది.

ఇదిలావుంటే.. కొవిడ్ నేఫ‌థ్యంలో ఓట్ల లెక్కింపునకు నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మే 1, 2 తేదీల్లో పరీక్షలు చేయించుకుని నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న వాళ్లను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించారు. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


సామ్రాట్

Next Story