రూ.100 కోట్లు ఇవ్వండి

నాగార్జునసాగర్, బుద్ధవనం సమగ్ర పర్యాటక అభివృద్ధికి స్వదేశ్ దర్శన్ పథకం 2.0 కింద రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీరారెడ్డి గురువారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

By Medi Samrat  Published on  5 Dec 2024 8:46 PM IST
రూ.100 కోట్లు ఇవ్వండి

నాగార్జునసాగర్, బుద్ధవనం సమగ్ర పర్యాటక అభివృద్ధికి స్వదేశ్ దర్శన్ పథకం 2.0 కింద రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీరారెడ్డి గురువారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సంబంధించి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని రఘువీరారెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్, బుద్ధవనం ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మారడానికి అవకాశాలు ఉన్నాయని, ఈ నిధులు తెలంగాణ సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి సహాయపడతాయని ఆయన తెలిపారు.

నాగార్జునసాగర్ ఇప్పటికే ప్రకృతి అందాలకు, చారిత్రక ప్రదేశాలకు, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు గజేంద్ర సింగ్. అదనంగా బుద్ధవనం, అంతర్జాతీయ పర్యాటకులను, ముఖ్యంగా జపాన్, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి పర్యాటకాన్ని మరింత పెంచే ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అని తెలిపారు.

Next Story