ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక పేరు మారుస్తాం: మంత్రి ఉత్తమ్

సీతారామ ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ను తెలంగాణ మంత్రులు సందర్శించారు.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 9:30 PM IST
telangana,, minister uttam,  sitarama project ,

ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక పేరు మారుస్తాం: మంత్రి ఉత్తమ్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ను తెలంగాణ మంత్రులు సందర్శించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తర్‌ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సందర్శించిన వారిలో ఉన్నారు. ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులతో వారు సమావేశం అయ్యారు. మంత్రులకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు చాలా అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆరు నెలల్లో ఆరు ప్రాజెక్టును ఆయన సందర్శించానని చెప్పారు. రూ.9వేల కోట్లు ఖర్చు చేసి కూడా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రీ డిజైన్‌ పేరుతో వారు డబ్బులు దండుకున్నారు తప్ప.. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పనులు చేయలేదన్నారు. ప్రభుత్వ ధనాన్ని ప్రాజెక్టుల పేరుతో దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఇక సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు కెనాల్‌కు రాజీవ్‌ కెనాల్‌గా పేరు పెడతామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు.

గత బీఆర్ఎస్ సర్కార్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని ఆరోపింరు. కేవలం రూ.2654 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లు పెంచి ప్రజాధానాన్ని లూటీ చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం వచ్చిన వెంటనే రివ్యూ చేసి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

Next Story