రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ ప్రకటన

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2024 7:51 PM IST
telangana, minister uttam, comments,  ration cards ,

రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ ప్రకటన 

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుల జారీకోసం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్, దామోదర, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం అయ్యి చర్చించింది.

ఈ మేరకు మాట్లాడిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు, లేదా చెలక 7.5 ఎకరాల లోపు భూమి ఉన్నవారినే ఎంపిక చేయాలని ప్రతిపాదించినట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల గరిష్ట వార్షిక ఆదాయం ఉన్నవారినే అర్హులుగా నిర్ణయించాలని సూచించినట్లు చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజా ప్రతినిదుల సలహాలు తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. సక్సేనా కమిటీ సిఫారసులను రేషన్ కార్డుల మంజూరుక పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్‌ కార్డులుండగా.. పెండింగులో 10 లక్షల దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే రేషన్‌ కార్డుల పంపిణీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు.

Next Story