రైతుబంధుపై కీలక అప్‌డేట్ ఇచ్చిన మంత్రి తుమ్మల
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు నిధులు అందించింది. అ
By Srikanth Gundamalla Published on 8 May 2024 9:30 AM ISTరైతుబంధుపై కీలక అప్‌డేట్ ఇచ్చిన మంత్రి తుమ్మల
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు నిధులు అందించింది. అయితే.. ఇదే పథకాన్ని కొనసాగిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దాని పేరుని రైతుభరోసాగా మార్చింది. ఏడాదికి రూ.15వేల చొప్పున ఎకరానికి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పెట్టుబడి అందించేందుకు ఎలాంటి పరిమితులు లేవే, ఎన్ని ఎకరాలు ఉన్నా.. ఎలాంటి భూమికైనా రైతుబంధు నిధులు అందించారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతుభరోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్‌డేట్ ఇచ్చారు.
అర్హులు అయిన రైతులకు రైతుభరోసా నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచ చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయ్యాయి. కానీ.. ఐదెకరాలు పైన ఉన్నవారికి మాత్రం ఇంకా ఈ పంటపెట్టుబడి సాయం అందలేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎలక్షన్న కమిషన్ ఈ నిధుల పంపిణీకి బ్రేక్ వేసిందని చెప్పారు తుమ్మల. అయితే.. పోలింగ్ పూర్తయిన తర్వాత నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
ఇక మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంజరు భూములు, విదేశాల్లో ఉన్నవారికి కూడా లక్షల రూపాయల రైతుబంధు డబ్బులు ఇచ్చారని మంత్రి తుమ్మల అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులు, పంట పండే వ్యవసాయ భూములకే రైతు భరోసా ఇచ్చేలా చూస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే విధివిధానాలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.