తెలంగాణలో 2లక్షల ఉద్యోగాల భర్తీపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  13 Jan 2024 2:24 AM GMT
telangana, minister sridhar babu, 2 lakh jobs,

తెలంగాణలో 2లక్షల ఉద్యోగాల భర్తీపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. బీఆర్ఎస్‌ను గద్దె దించి కాంగ్రెస్‌ సర్కార్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో ఒకటైన 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామనే దానిపై ఇప్పుడు నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్‌ చేస్తున్నారు. ప్రబుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తే త్వరగా అప్లై చేసుకుని అందుకు ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన చేశారు.

తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అలాగే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ పట్ల నిర్లక్ష్యం వహించిందని చెప్పిన ఆయన.. తాము ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుకాబోతుందని గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఇక ప్రయివేట్‌ రంగంలో కూడా మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణల వరల్డ్‌లోనే మొదటిస్థానంలో ఉండబోతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌ సెంటర్లు, స్కిల్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. త్వరలోనే వీటి ఏర్పాటుకు చర్యుల తీసుకుంటామన్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ సహా సభ్యులు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలను గవర్నర్‌ ఇటీవల ఆమోదించారు. దాంతో.. కొత్త కమిషన్‌ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అర్హుల నుంచి ఆహ్వానాలను స్వీకరిస్తోంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఫుల్‌ ఫోకస్‌ పెట్టనుంది.

Next Story