నా సోద‌రుడు సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం గొప్ప‌గా జ‌రిగింది : మంత్రి కేటీఆర్

Telangana Minister KTR and AP CM Jagan meeting in Davos Summit.దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 May 2022 11:17 AM IST

నా సోద‌రుడు సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం గొప్ప‌గా జ‌రిగింది : మంత్రి కేటీఆర్

దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం(ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు) వేదిక‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. 'నా సోద‌రుడు సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం గొప్ప‌గా జ‌రిగింది' అని జ‌గ‌న్‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. వీరి భేటీలో ఏ అంశాల‌పై చ‌ర్చించారు అన్నది తెలియ‌రాలేదు.

మరోవైపు.. పెట్టబడులే లక్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పలువురు ప్రతినిధులను కలుస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. అటు మంత్రి కేటీఆర్ కూడా పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించారు. పలు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు, పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.

Next Story