బోనాల పండుగకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు: మంత్రి కొండా సురేఖ
2024 జులై 7వ తేదీ నుంచి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 1:22 PM GMTబోనాల పండుగకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు: మంత్రి కొండా సురేఖ
తెలంగాణలో అంగరంగ వైభవంగా బోనాల పండుగా సాగుతుంది. ప్రతి గ్రామంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. అయితే.. బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా మంత్రి కొండా సురేఖ తెలిపారు. 2024 జులై 7వ తేదీ నుంచి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. పలు విషయాలను వెల్లడించారు. బోనాల పండుగ కోసం అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో అంగరంగ వైభంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గత ప్రభుత్వం అరకొర ఏర్పాట్లను చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. కానీ.. తాము అలా కాదనీ ప్రజల కోసం ఏవైనా చేస్తామని అన్నారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత వైభవంగా బోనాలు జరుగుతాయన్నారు. రూ.25 కోట్లు ఫండ్స్ విడుదల చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. బోనాల పండుగ కోసం స్పెషల్ బస్సులు నడిపేలా ఆర్టీసీ యాజమాన్యానికి సూచనలు చేస్తామన్నారు. త్వరలోనే బోనాల డేట్స్.. అలాగే పూర్తి సమాచారంతో క్యాలెండర్‌ను విడుదల చేస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.