Telangana: 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లకు ఆమోదం
తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది.
By Srikanth Gundamalla
Telangana: 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లకు ఆమోదం
తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ అన్ని నియోజకవర్గాలను కలుపుకొని 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. అయితే.. మల్కాజిగిరిలో 114 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఇక మెదక్‌లో ఒక నామినేషన్ తిరస్కరణ అయ్యిందన్నారు.
ఆయా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆమోదం పొందిన నామినేషన్ల వివరాలను ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 53 నామినేషన్లకు ఆమోదం లభించిందని చెప్పారు. ఇక ఆదిలాబాద్‌లో 13, పెద్దపల్లిలో 49 నామినేషన్లకు ఆమోదం, నిజామాబాద్‌లో 32, జహీరాబాద్‌లో 26, సికింద్రాబాద్‌లో 46 నామినేషన్లకు ఆమోదం లభించిందని తెలిపారు. హైదరాబాద్‌లో 38, చేవెళ్లలో 46, మహబూబ్‌నగర్‌లో 35, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 21 నామినేషన్లను ఆమోదించామని చెప్పారు. నల్లగొండలో 31 నామినేషన్లు, భువనగిరిలో 51, వరంగల్‌లో 48, మహబూబాబాద్‌లో 25, ఖమ్మంలో 41 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు.
మరిన్ని నియోజకవర్గాల్లో తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలను కూడా వికాస్ రాజ్ చెప్పారు. ఆదిలాబాద్‌లో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని అన్నారు. కరీంనగర్‌లో 20, పెద్దపల్లిలో 14, నిజామాబాద్‌లో 10, జహీరాబాద్‌లో 14 నామినేషన్లు తిరస్కరణ, సికింద్రాబాద్‌లో 11, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 17 నామినేషన్లు తిరస్కరణ, చేవెళ్లలో 18, మహబూబ్‌నగర్‌లో 7, నాగర్‌కర్నూలులో 13, నల్లగొండలో 25, భువనగిరిలో 10, మహబూబాబాద్‌లో 5, ఖమ్మంలో 4, వరంగల్‌లో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయినట్లు వికాస్‌రాజ్ ప్రకటించారు.