Telangana: పార్టీల్లో మద్యం వినియోగంపై అధికారుల నిఘా

తెలంగాణలో అబ్కారీ శాఖ అధికారులు అక్రమంగా వినియోగిస్తున్న మద్యంపై నిఘా పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  13 July 2024 1:06 AM GMT
Telangana, liquor,  parties, excise department,

Telangana: పార్టీల్లో మద్యం వినియోగంపై అధికారుల నిఘా

తెలంగాణలో అబ్కారీ శాఖ అధికారులు అక్రమంగా వినియోగిస్తున్న మద్యంపై నిఘా పెట్టారు. పలుచోట్ల జరుగుతున్న పార్టీలు, ఫంక్షన్లలో మద్యం వినియోగంపై ఫోకస్‌ పెట్టబోతున్నారు. సుంకం చెల్లించకుండా మద్యం వినియోగిస్తే ఇప్పటికే దాడులు చేస్తున్న అధికారులు.. ఇక నుంచి ప్రత్యేక బృందాల ద్వారా రంగంలోకి దిగబోతుంది. నాన్‌ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ పై అబ్కారీ శాఖ అధికారులు సీరియస్‌గా వ్యవహరించబోతున్నారు.

పార్టీలు, ఫంక్షన్లలో మద్యం వినియోగించడానికి ముందుగా ఆబ్కారీ శాఖ నుంచి 'ఈవెంట్ పర్మిషన్' తీసుకోవాల్సి ఉంటుంది. అయిఏత.. కొందరు అనుమతి తీసుకున్నా కూడా ఢిల్లీ, గోవా వంటి ప్రాంతాల నుంచి దొంగచాటుగా మద్యం తీసుకొచ్చిన మద్యాన్ని వినియోగిస్తున్నారు. పార్టీలో అతిథులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆబ్కారీ శాఖ అధికారులుకు సమాచారం అందింది. దాంతో..ఆబ్కారీశాఖ కమిషనర్‌ శ్రీధర్, ఎక్సైజ్‌ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. ఇలాంటి ఈవెంట్లకు అనుమతి తీసుకకపోవడం, ఎన్‌డీపీఎల్ మద్యం వినియోగించడంపై కేసులు నమోదు చేస్తున్నారు. ఏకంగా గతేడాది 302 కేసులు నమోదు అయ్యాయి. 165 మందిని నిందితులుగా చేర్చి 35 వరకు వాహనాలను సీజ్ చేశారు. రూ.61.13 లక్షల విలువైన మద్యాన్ని జప్తు చేశారు. ఈ నేపథ్యంలో మద్యంతో ఈవెంట్లు నిర్వహించే వారు నిబంధనలు పాటించాలని.. ఎన్‌డీపీఎల్‌ మద్యం వినియోగించొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మద్యంను వినియోగించే ఈవెంట్లకు పర్మీషన్ తీసుకోవాలని చెబుతున్నారు.

Next Story