ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్

ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రముఖ జర్నలిస్టు అమీర్‌ అలీఖాన్‌లు ప్రమాణస్వీకారం చేశారు.

By Srikanth Gundamalla  Published on  16 Aug 2024 11:54 AM IST
Telangana, kodandaram, amer ali khan,    mlc,

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్

హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రముఖ జర్నలిస్టు అమీర్‌ అలీఖాన్‌లు ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలోని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వీరిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌లకు మంత్రులు అభినంతనలు తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శి కొత్త ఎమ్మెల్సీలకు రూల్‌ బుక్‌ అందజేశారు.

ప్రమాణస్వీకారం తర్వాత ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అలాగే గవర్నర్, మండలి చైర్మన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు కోదండరాం. ఎమ్మెల్సీ అవ్వడం అనేది అదనపు బాధ్యతగా మాత్రమే తాను భావిస్తాననీ.. ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని చెప్పారు. ఉద్యమకారులు, అమరీవీరుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అయితే.. ఎంతో మంది బలిదానాలు చేయడం వల్లే ఈ స్థానం వరకూ వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.



Next Story