తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 12:02 PM GMTతెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టిక్ పరీక్షలు (జనరల్/వొకేషనల్ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు అధికారులు. అయితే.. రెండో శనివారం, ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 2 గంఒటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు కొనసాగుతాయి.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు:
* ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
* మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1
* మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1
* మార్చి 6న మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1
* మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1
* మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు:
* ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
* మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2
* మార్చి 5న మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2
* మార్చి 7న మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2
* మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2
* మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ ౨