మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తారా? రూ.కోటి చెల్లించండి..పిటిషనర్‌కు హైకోర్టు షాక్

తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది.

By Knakam Karthik  Published on  18 March 2025 1:33 PM IST
Telangana High Court, Judgement, Petitioner, Penalty

మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తారా? రూ.కోటి చెల్లించండి..పిటిషనర్‌కు హైకోర్టు షాక్

తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఓ కేసులో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించినందుకుగాను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ సంచలన తీర్పును వెలువరించారు. ఈ మేరకు పిటిషనర్‌కు రూ.జరిమానా విధిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ భూముల విషయంలో హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచి పెట్టి వేరే బెంచ్‌ను పిటిషనర్లు ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే కోర్టును తప్పుదోవ పట్టించేలా.. వారి సమయం వృథా చేసేలా మరో బెంచ్‌లో తిరిగి పిటిషన్లు వేయడం న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ భూములు కాజేయాలని తప్పుడు రిట్ పిటిషన్లు వేసిన పిటిషనర్లకు రూ.కోటి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ తీర్పుతో అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకోవాలనే యత్నానికి హైకోర్టు చెక్ పెట్టినట్లయింది. ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story